- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Puttaparthi: మాటల వార్ నడుస్తున్నా ఈసారి ఆయనకే ఛాన్స్?

దిశ, కడప ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే పుట్టపర్తి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నాయకులు ఎడ మొహం పెడ మొహం పెట్టుకొని కనిపించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకట్ట వేయడమే కాకుండా ముఖ్యమంత్రి రాక సందర్భంగా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడం, ఇతర కార్యక్రమాలకు తరచూ అడ్డు చెప్పడం లాంటి విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ నాయకులు తెలిపారు. అయితే నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సీఎం సూచించారు.
మరోవైపు పుట్టపర్తి టికెట్‌ను సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి మరికొందరు నాయకులు ఆశిస్తున్నటు తెలస్తోంది. అయితే నియోజకవర్గంలో పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. దీంతో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎమ్మెల్యే అందరిని కలుపుకొని పోయే పరిస్థితి లేకపోవడంతో నియోజకవర్గంలో గ్రూపులు మరింత విస్తరించినట్లు పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు.
అయితే గోరంట్ల మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్త శ్రద్ధ చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగానే పుట్టపర్తి పర్యటనకు వచ్చిన సందర్భంగా పలు అంశాలను ఇంద్రజిత్ రెడ్డితో సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇంతకుముందు ఇంద్రజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో పలుమార్లు కలిశారు. ఇంద్రజిత్ రెడ్డి సతీమణి ఎంతవరకు చదువుకున్నారని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇంద్రజిత్ రెడ్డి భార్యకు పుట్టపర్తి నుంచి ఛాన్స్ దక్కుతుందేమో అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక జిల్లాలో పాముదుర్తి రవీంద్రారెడ్డి కుటుంబం చాలా సంవత్సరాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. అయితే వైయస్ మరణాంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా పాముదుర్తి కుటుంబానికి సరైన గుర్తింపు లభించలేదు. వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబానికి కష్టంగా రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.