Kalyandurg: కోట్ల విలువైన మద్యం ధ్వంసం

by srinivas |
Kalyandurg: కోట్ల విలువైన మద్యం ధ్వంసం
X

దిశ, కళ్యాణదుర్గం: సత్యసాయి జిల్లాలో రూ. 2.58 కోట్ల విలువైన 10,638 లీటర్ల మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు సెబ్ విభాగం పోలీసులు జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. 7 కేసులు నమోదు చేసి ఆరుగుర్ని అరెస్టు చేయడంతో పాటు 177 టెట్రా పాకెట్లు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు కంబదూరు, కళ్యాణదుర్గం సెబ్ స్టేషన్ పరిధిలో ఉన్న స్పెషల్ టీం సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 2 కేసులు నమోదు చేసి ఇద్దర్ని అరెస్టు చేశారు. 177 టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బుక్కరాయ సముద్రం సెబ్ స్టేషన్ పరిధిలో ఒకర్ని అరెస్టు చేశారు. 19 లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు. కళ్యాణదుర్గం సెబ్ స్టేషన్ పరిధిలో జిల్లా ఇంటెలిజెన్స్ టీం ఆధ్వర్యంలో 3 నాటు సారా వాష్ కేసులు నమోదు చేసి ఇద్దర్ని అరెస్టు చేశారు. 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 8 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి సెబ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి ఒకర్ని అరెస్టు చేశారు.

Next Story

Most Viewed