ఏపీ ప్రజలు మా గుండెల్లో ఉన్నారు.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
ఏపీ ప్రజలు మా గుండెల్లో ఉన్నారు.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల వేళ ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ కావడంతో పార్టీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.జాతీయ నేతలను రాష్ట్రానికి పిలిపించి మరీ హామీలు ఇప్పిస్తున్నారు. తాజాగా అనంతపురంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా దేశానికి ఇద్దరు రాష్ట్రపతులను ఇచ్చిందని ఖర్గే గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు సత్యసాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారు. ఆయన ఆశయాల కోసమే షర్మిలను తీసుకొచ్చామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన హామీలు నెరవేరుస్తామన్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, మాజీ అధ్యక్షులు శైలజా నాధ్, గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరా రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, దాదా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Next Story