పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో నాగుపాము.. ఎంచక్కా ఏసీ రూమ్‌లో సేదతీరుతూ..

by Nagaya |
పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో నాగుపాము.. ఎంచక్కా ఏసీ రూమ్‌లో సేదతీరుతూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న జనాలు బయటకు వెళ్లలేకపోతుంటే.. ఎండవేడి తట్టుకోలేక పుట్టలో ఉన్న పాములు సైతం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు చల్లగా ఉండే ఆఫీసుల్లోకి కూడా చొరబడుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తహశీల్ధార్ కార్యాలయంలో నాగుపాము పాము హల్‌చల్ చేసింది. ఆఫీసులోని ఒక మూలకు వెళ్లి ఉన్న తాచుపామును చూసిన ఆఫీస్ సిబ్బంది ఒక కప్పులో పాలు కూడా పెట్టారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని రొద్దం మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. తహసీల్ధార్ కార్యాలయంలోకి ఓ నాగుపాము దూరి కలకలం రేపింది. ఎండవేడికి తట్టుకోలేని ఈ విషసర్పం కార్యాలయంలోకి వచ్చి అందులోనూ ఏసీ రూమ్‌లో సేద తీరింది. ఈ నాగుపామును చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే పాము ఏమీ చేయకుండా మూలన అణిగిపోయింది. ఇంతలో ఆఫీసులో పనిచేసే ఓ వ్యక్తి పాము తాగేందుకు కప్పులో పాలు కూడా పెట్టడం విశేషం. ఇకపోతే తహసీల్ధార్ కార్యాలయంలో నాగుపామును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అనంతరం తహసీల్ధార్ కార్యాలయం సిబ్బంది రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఏసీ రూములో ఎంచక్కా రెస్ట్ తీసుకుంటున్న నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story