- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ సారి ఆయకే మా మద్దతు.. పట్ర కులస్తుల తీర్మానం

దిశ, అనంతపురం ప్రతినిధి: మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర తమ కోసం ఎంతో చేశారని.. ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చిందని పట్ర కులస్తులు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి Paritala Sriram was met by the Patra caste of Mudigubba Mandal. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిటాల రవీంద్రతో తమకు ఎప్పటి నుంచో అనుబంధం ఉండేదన్నారు. ఆ రోజుల్లో ఏ కష్టం వచ్చినా.. ఆయన వెంటనే స్పందించేవారని గుర్తు చేశారు. ఆయన మరణం తమకు తీరని లోటని చెప్పారు. ఇన్ని రోజుల తరువాత పరిటాల శ్రీరామ్ ధర్మవరం రావడంతో ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్‌కు మంచి ఆదరణ ఉందని.. ఆయన్ను గెలిపించేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. శ్రీరామ్‌ను గెలిపించి.. రవి రుణం తీర్చుకుంటామన్నారు. మరోవైపు శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ పట్ర కులస్తులకు అండగా ఉందన్నారు. ఇప్పటి నుంచే ముదిగుబ్బ మండలంలో స్థానిక టీడీపీ నాయకత్వంతో కలసి పని చేయాలని శ్రీరామ్ సూచించారు.