భూమి కోసం కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో వృద్ధురాలి నిరసన

by srinivas |
భూమి కోసం కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో వృద్ధురాలి నిరసన
X

దిశ, అనంతపురం ప్రతినిధి: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అనుచరుడు వేణు తమ భూమిని ఆక్రమించారని, అధికారులు జోక్యం చేసుకోవాలని కనుముక్కల భానోజీ అనే వృద్ధురాలు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. శింగనమల మండలం ఆకులేడులో తమకు పొలం ఉందని, అందులోకి వెళ్లనివ్వకుండా వేణు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 1934 నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూమిని వేణు ఆక్రమించారని ఆరోపించారు. రికార్డులతో ఎమ్మార్వో, సచివాలయ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డిని కలిసి విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ అయినా కనికరించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

Next Story

Most Viewed