- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అభివృద్ధి ప్రదాత అన్న ఎన్టీఆర్

దిశ, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రాభివృద్ధి ప్రదాత, సంక్షేమ సారధి ఎన్టీఆర్ అని ఆయన కుమార్తె, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణకు శనివారం ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో కలిసి ఆమె విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడానికి కారణం నందమూరి తారకరామారావేనన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఇళ్ల నిర్మాణాలు, మహిళలకు ఆస్తి హక్కు, హంద్రీనీవా కాలువకు రూపకల్పన చేసిన మహోన్నతుడని కొనియాడారు. దేశంలోనే ఒక తిరుగులేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి నందమూరి తారకరామారావని, అలాంటి మహనీయుడి విగ్రహావిష్కరణ తమ చేతుల మీదుగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ చనిపోయి మూడు దశాబ్దాలు కావస్తున్నా ప్రజల గుండెల్లో మాత్రం చిరంజీవిగా కొలువై ఉండడం పూర్వజన్మ సుకృతమని పురంధేశ్వరి, పయ్యావుల పేర్కొన్నారు.