Raptadu: టీడీపీ, వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు

by Disha Web Desk 16 |
Raptadu: టీడీపీ, వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు
X

దిశ వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా నుంచి జాకీ కంపెనీ తరలిపోవడంతో వైసీపీ నేతలపై విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం జగన్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి టార్గెట్‌గా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తమ్ముడు చందు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తోపుదుర్తి చందుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జగ్గు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ ఆందోళనకు దిగారు. తోపుదుర్తి చందుపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసిన తమ వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే సీకేపల్లి పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు. తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలతో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులపై సీకేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అటు టీడీపీ నేత జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. మరోవైపు వైసీపీ నాయకులపైనా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీస్ 30 యాక్ట్ ఉల్లంఘించారని పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, బీకే పార్థసారథిలపైనా సుమోటో కేసు నమోదు చేశారు.


Next Story