Ap News: జెన్‌కోను ప్రైవేటీకరిస్తున్నారా?

by srinivas |   ( Updated:2022-12-25 16:25:36.0  )
Ap News: జెన్‌కోను  ప్రైవేటీకరిస్తున్నారా?
X
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించని ప్రభుత్వం
  • జెన్కోను ఎలా ప్రవేటీకరించగలిగింది
  • ప్రైవేటీకరించినా మూడో యూనిట్‌ను ఎందుకు ప్రారంభించారు
  • ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు

దిశ, నెల్లూరు: కృష్ణపట్నం ప్లాంటు విషయంలో ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నెల్లూరు జెన్‌కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకమని ప్రకటించిన ప్రభుత్వం జెన్‌కో ఎలా ప్రైవేటీకరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నష్టాలున్నాయని విశాఖ స్టీల్‌పై కేంద్రం చెబుతోందని, కృష్ణపట్నంపై కూడా ఏపీ ప్రభుత్వం అదే చెబుతోందని, రాష్ట్రానికి ఉన్న అప్పుల భారం నుంచి భయటపడేందుకు జెన్‌కోను ప్రవేటీకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులు, భూములిచ్చిన వాళ్లు జెన్ కో ప్రైవేటీకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌‌ని 25సంవత్సరాలకు లీజుకు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నష్టాల సాకు చూపి వైసీపీ ప్రభుత్వం పెద్దమెత్తంలో అవినీతికి పాల్పడుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. జెన్ కోను ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు రూ.. 25 కోట్లు ఖర్చు చేసి జెన్‌కోలో మూడో యూనిట్‌ను జగన్ ఎందుకు ప్రారంభించారన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌ను రూ.21 వేల కోట్లు పెట్టుబడితో 1490 ఎకరాల్లో నిర్మించారు. ఈ ప్లాంటులో ఇంజినీర్లతో సహా అన్ని రకాల కార్మికులు కలిపి 1810 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకి 5 కి.మీ దూరంలో రైతుల నుంచి భూములు సేకరించి ఈ ప్లాంట్ నిర్మించారు. 2014లోనే మొదటి రెండు యూనిట్లు అందుబాటులోకి రావడంతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మూడో యూనిట్‌ను కూడా గతంలో జగన్ ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ నుంచి ఏపీలో జెన్ కో గతంలో అప్పులు తీసుకుంది. వాటిని సకాలంలో చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏపీ సర్కార్ ఉన్న పరిస్దితుల్లో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే పరిస్దితి లేదు. ఇప్పటికే జెన్ కో అప్పులు చెల్లించలేదక డిఫాల్టర్‌గా మీరింది. ఇక ఆర్ధికం వెసులుబాటు లేకపోవడంతో జెన్కోకు ఈ దుస్ధితి నెలకొంది.

Next Story