యువ‌గ‌ళం@ 700 కి.మీ.. లోకేష్ ఇచ్చిన 8వ హామీ ఇదే!

by Nagaya |
యువ‌గ‌ళం@ 700 కి.మీ.. లోకేష్ ఇచ్చిన 8వ హామీ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల పాదయాత్రను లోకేశ్ పూర్తి చేశారు. యువ‌గ‌ళం ప్రభంజ‌న‌మై 700 కి.మీ. మైలురాయిని పూర్తి చేసుకున్న నేపథ్యంలో లోకేశ్ కీలక హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో గోరంట్ల మండలం, మడకశిర ప్రాంతాల‌ ప్రజలు ఎదుర్కొంటున్న తాగు, సాగునీటి స‌మ‌స్యల శాశ్వత ప‌రిష్కారానికి పునాది కానుందని లోకేశ్ వెల్లడించారు. ఇకపోతే ప్రతీ 100 కిలోమీటర్లకు నారా లోకేశ్ కీలక హామీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు కీలకమైన హామీలు ఇచ్చిన లోకేశ్ తాజాగా హంద్రీనీవా కాలువపై హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏడు హామీలలో నీటిసమస్యల పరిష్కారంపైనే ఇవ్వడం విశేషం.

Next Story