Nara lokesh: సహకరిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్రే..

by Disha Web Desk 16 |
Nara lokesh: సహకరిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్రే..
X

దిశ, కదిరి: తాను చేపట్టిన యువగళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తే మంచిదని, లేనిపక్షంలో దండయాత్ర చేయాల్సివస్తుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గం జోగన్నపేట వద్ద నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడారు.


ఆ హామీలేమయ్యాయి...?

అధికారం చేపట్టకు ముందు మహిళలకు, మైనార్టీలకు బీసీలకు, దళితులకు, ఉద్యోగులకు అన్ని విధాల సహాయ పడుతూ ముందుకు తీసుకెళ్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా ఎవరి సమస్య కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు సీపీఎస్, పోలీసులకు వారంతపు సెలవు కూడా చేయలేదన్నారు. బీసీల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే గానీ తగిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై 25 వేల కేసుల పెట్టి పలువురిని జైలుకు పంపడం జరిగిందని తెలిపారు.

అన్ని వర్గాలపై దాడులు

నాలుగు ఏళ్ల కాలంలో దళితులు, మైనార్టీలపై జరిగిన దాడులు అన్నీఇన్నీ కావని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనగా నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్య, ఇంకా తిరుపతి తదితర ప్రాంతాలలో జరిగిన సంఘటనలు చెప్పవచ్చన్నారు. ఇలా అన్ని వర్గాల వారికి ఫేక్ సీఎం జగన్ మోసం చేసిన కారణంగానే ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూర్తిగా విఫలమయ్యారని, ఇందుకు టమోటో రైతుల ఆక్రందనలే నిదర్శనమన్నారు.

రైతుల మృతి విచారకరం..

వాస్తవానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందడం విచారకరమని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి, సంక్షేమం కోసం కృషి చేయడమే తమ లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed