టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

by Disha Web Desk 18 |
టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
X

దిశ ప్రతినిధి, అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం నిడుమామిడి గ్రామం కార్యకర్త మునిమడుగు బావయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఈ రోజు ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, నిమ్మల కిష్టప్ప,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే లు పార్థసారథి , కందికుంట వెంకట ప్రసాద్ , సవితమ్మ, జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్ తదితరులు స్వాగతం చెప్పారు. చంద్రబాబు పై అక్రమ అరెస్టు ను తట్టుకోలేక గుండెపోటుతో 2023 అక్టోబర్ 1న టీడీపీ కార్యకర్త బావయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఆయన చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. భువనమ్మను చూడగానే బావయ్య కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. వారిని ఓదార్చి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బావయ్య కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సహాయం అందించారు.

Read More..

జనం నమ్మలేదనే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడు: డిప్యూటీ స్పీకర్


Next Story

Most Viewed