Kambadur: కన్న కొడుకే కాలయముడై..

by Disha Web Desk 16 |
Kambadur: కన్న కొడుకే కాలయముడై..
X

దిశ, కళ్యాణదుర్గం: చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు నవ మాసాలు పెంచిపోషించిన కన్నతల్లిని పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన సోమవారం కంబదూరులో చోటుచేసుకుంది. సుజాత గోపి దంపతుల కుమారుడైన ప్రణీత్ చెడు వ్యసనాలకు బానిసయ్యారు. కొద్దిరోజులుగా డబ్బుకోసం తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. సోమవారం ఉదయం మద్యం సేవించేందుకు డబ్బులు అడగగా తల్లి ఇవ్వకపోవడంతో కొడుకు ప్రణీత్ ఆగ్రహానికి గురయ్యారు. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో సుజాత (68) పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ద్వారా ఆమె కరెంట్ షాక్ కొట్టి మరణించిందని భావించారు అయితే పోలీసులు అనుమానం వచ్చి విచారణ చేయగా కన్ను కొడుకే హతమార్చినట్లు వెల్లడయింది.


Next Story

Most Viewed