Puttaparthi: మాన‌వ‌త్వం చాటుకున్న ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి

by srinivas |
Puttaparthi: మాన‌వ‌త్వం చాటుకున్న ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పుట్టప‌ర్తి ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి(Puttaparthi MLA Sindhura Reddy) మాన‌వ‌త్వం చాటుకున్నారు. తన నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్తచెరువు వ‌ద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు యువ‌కుల‌కు గాయాలయ్యాయి. ఆ స‌మ‌యంలో రోడ్డుపై తమ కాన్వాయ్‌లో ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి, మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి(Former Minister Palle Raghunath Reddy) అనంత‌పురానికి వెళ్తున్నారు.


రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్‌ను ఆపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువ‌కుల‌కు ధైర్యం చెప్పారు. అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి పంపారు. అంతేకాదు యువ‌కుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

Next Story