మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ..

by Disha Web Desk 16 |
మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ..
X

దిశ, అనంతపురం ప్రతినిధి : శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో శనివారం మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తగిలింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే‌గా ఉన్న ఆమెను ప్రస్తుతం పెనుగొండ సమన్వయకర్తగా వైసీపీ అధినాయకత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సరస్సు పెనుగొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా శనివారం ఆమె చాల కూరు గ్రామ పర్యటనకు వెళ్లారు. అయితే ఆమెను పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వారితో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అయితే మంత్రి ఉషాచరణ్ కూడా కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని వెళ్లిపోవడంతో ఉద్రిక్తతలు సద్దుమనిగించింది.

Next Story