- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Ushasri: అవినీతికి కేరాఫ్ టీడీపీనే

దిశ, కళ్యాణదుర్గం: అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీనేనని మంత్రి ఉషాశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. అనంతపూరం జిల్లా కంబదూరులో సచివాలయాల గృహాసారథులతో జరిగిన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషాశ్రీ సంపన్నులకు, పేదలకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వానికి మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచే సునాయాస ఆయుధం సంక్షేమ క్యాలెండర్ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగనన్న పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. సచివాలయాల కన్వినర్లు , గృహాసారథుల, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సీఎం జగనన్న చేపట్టిన సంక్షేమ క్యాలెండర్ల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జగనన్న సైనికుడిగా వాళ్ల ముందుకు వచ్చారని. ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఉషాశ్రీ పేర్కొన్నారు.