19న శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి రోజా పర్యటన

by srinivas |
19న శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి రోజా పర్యటన
X

దిశ, అనంతపురం: ఈ నెల 19న శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో జరిగే యోగివేమన జయంతోత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి రోజా గురువారం ఉదయం మదనపల్లి నుంచి బయలుదేరి 07:30 గంటలకు కదిరికి చేరుకుంటారు.

అనంతరం కదిరి లక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అనంతరం కదిరి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు గాండ్లపెంట మండలం కటారుపల్లిలో జరిగే యోగివేమన జయంతోత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. భోజన విరామం తర్వాత కటారుపల్లి నుంచి బయలుదేరి నగరికి మంత్రి వెళ్లనున్నట్లు కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed