- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cm Jagan నాయకత్వంపై మంత్రి పెద్దిరెడ్డి భావోద్వేగం

దిశ, అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండడం గర్వంగా భావిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావోద్వేగంతో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఏల్లారెడ్డిగారి భీమ్ రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతేకాదు నూతనంగా నిర్మించిన భీమా పార్క్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతోందన్నారు. గతంలో లాగా జన్మభూమి కమిటీలు లేవన్నారు. వారుంటే కేవలం డబ్బులు ఇచ్చిన వారికే పథకాలు అందించేవారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
తాను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారని, అయితే సీఎం జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలగా పని చేయడం చాలా గర్వంగా ఉందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాలు కరోనాతో పోయిందని, రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయిందని తెలిపారు. అయినా ఏ పథకాలూ ఆపలేదని, చంద్రబాబు లాగా హామీలు ఇచ్చి మాట తప్పలేదన్నారు. ఏల్లారెడ్డి భీమీరెడ్డితో తనకు పరిచయం లేదని, అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. అయినప్పటికీ హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిస్తే చాలా ఆప్యాయంగా పలకరించేవాడని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు.