- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLA:శిల్పారామాన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దండి

దిశ ప్రతినిధి,అనంతపురం: నగర శివారులోని నేషనల్ పార్క్ లో ఉన్న శిల్పారామాన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శిల్పారామం ఏవో కృష్ణతో ఆయన సమావేశం నిర్వహించారు. శిల్పారామంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులేంటి, పర్యాటకులు రోజుకు ఎంత మంది వస్తున్నారు. వారికి తగిన విధంగా సౌకర్యాలు ఉన్నాయా అనే అంశాల గురించి తెలుసుకున్నారు. వేసవి వస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు పిల్లలు ఎక్కువగా శిల్పారామం వచ్చే అవకాశం ఉందన్నారు.
నగరం చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయని.. శిల్పారామం వారికి కచ్చితంగా నచ్చుతుందన్నారు. అందుకే ఇక్కడ పిల్లలు ఆడుకునే విధంగా, పెద్దల్ని ఆకర్షించే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతపురం నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి ఇది పిక్నిక్ స్పాట్ గా ఉంటుందన్నారు. అక్కడ ఎలాంటి అవసరం ఉన్నా.. తనని సంప్రదించాలని ఏవోకు ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు.