- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Madakasira ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారా?.. రికమండేషన్ తప్పనిసరి!

దిశ, శ్రీ సత్యసాయి: మడకశిరలో యాభై పడకల ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే రికమండేషన్ కావాలని రోగులు అంటున్నారు. అత్యవసర పరిస్థితిల్లోనూ అధికారులు చెబితేనే సిబ్బంది వైద్యం మొదలు పడతారట. ఇక 50 పడకల నుంచి నుంచి వంద పడకలకు పెంచుతూ ఆసుపత్రిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. విస్తరణకు తగ్గట్టుగా స్టాఫ్ కూడా పెరిగారు. అయితే రోగులను చూడటంలో మాత్రం నర్సులు అలసత్వం వహిస్తున్నారు. రోగుల పట్ల కనికరం కూడా చేపలేకపోతున్నారు. పంటి నొప్పితో వచ్చిన మహిళకు ఎటువంటి పరీక్షలు చేయకుండా రెండు రకాల మందులు ఇచ్చి పంపించారు. అయితే ఆమెకు పంటి నొప్పి ఎక్కువ అయింది. దయచేసి ఇంజక్షన్ ఇవ్వండని వేడుకున్నా పట్టించుకోలేదు. ఆమెకు తెలిసిన ఉన్నతాధికారితో చెప్పించడంతో నొప్పికి ఇంజక్షన్ వేశారు. ఇలా ఎవరికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరమైన వైద్యం కావాలంటే ఉన్నతాధికారుల సిఫార్సు కావాల్సిందేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు సైతం ఇక్కడి సిబ్బంది చుక్కలు చూపిస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి అందరికీ సరైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.