కొలిజియంకు నేను వ్యతిరేకం: Justice Chandru

by srinivas |   ( Updated:2022-12-18 12:56:34.0  )
కొలిజియంకు నేను వ్యతిరేకం: Justice Chandru
X

దిశ అనంతపురం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తును నియమించే విషయంలో ఇప్పుడు అమల్లోనున్న కొలిజియం విధానానికి తాను పూర్తిగా వ్యతిరేకమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు పేర్కొన్నారు. జస్టిస్‌ చిన్నపరెడ్డి శతజయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన అనంతపురం విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కొలిజియం విధానం లోపభూయిష్టమైందని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి ఎంపికకు ఒక హేతబద్ధమైన విధానం అవసరమని తాను భావిస్తున్నానని తెలిపారు. అట్టడుగు ప్రజల అభ్యున్నతికి అండగా నిలవడమే న్యాయస్థానాల లక్ష్యంగా ఉండాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబిసి) రిజర్వేషన్లు అమలు చేయవచ్చునని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా న్యాయమూర్తులు రిటైర్ అయిపోయి ఉంటారన్నారు. అందులో ఐదారుగురే మాత్రమే ఎప్పటికీ న్యాయచరిత్రలో నిలిచే వ్యక్తులున్నారని తెలిపారు. అందులో ఓ చిన్నపరెడ్డి ఒకరని పేర్కొన్నారు. పేద, సామాన్య ప్రజల కోణంలో ఆలోచించి తీర్పులిచ్చారని జస్టిస్‌ చంద్రు తెలిపారు.

Next Story

Most Viewed