ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని రక్షిస్తుంది: రాష్ట్రపతి ముర్ము

by srinivas |
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని రక్షిస్తుంది: రాష్ట్రపతి ముర్ము
X

దిశ, వెబ్ డెస్క్: పుట్టపర్తి ప్రశాంతతకు మారుపేరని, ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని రక్షిస్తుందని తెలిపారు. సత్యం, అహింస మన జీవనంలో భాగంగా కావాలని ముర్ము పిలుపునిచ్చారు. సత్యసాయి ట్రస్ట్ విద్య, వైద్యంతోపాటు ఇక్కడ చదివే విద్యార్థులు ఆధ్యాత్మిక చింతన, ఆత్మవిశ్వాసంతో పాటు విజ్ఞానవంతులుగా మారుతున్నారని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. మానవసేవే మాధవ సేవ అని బోధించిన శ్రీ సత్య సాయి బాబా అందరికీ ఆదర్శనీయమని ముర్ము పేర్కొన్నారు.

పుట్టపర్తి సాయి బాబా 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరంలో భారత రాష్ట్రపతి ప్రత్యేకంగా సత్య సాయి మహాసమాధిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ధ్యాన మందిరానికి వెళ్లి సత్య సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు.

అంతకుమునుపు సత్యసాయి బాబా జయంతి వేడుకలలో భాగంగా సత్యసాయి విద్యాసంస్థల స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానం ద్వారా మధ్యాహ్నం 3గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నాజర్ , మంత్రి ఉషశ్రీ చరన్ పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. సత్య సాయి విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. దర్శనం అనంతరం

పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాయంత్రం ఐదు గంటలకు సత్య సాయి విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. సత్య సాయి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రపతి ఢిల్లీకి వెళ్లారు.

Next Story