- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డబ్బు కోసం దౌర్జన్యం.. హిజ్రా అరెస్ట్

X
దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం జయనగర్‌కు చెందిన గాయత్రి దురదకుంటలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. పావగడకు వెళ్లాలని తన పిల్లలు సహా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండుకు వెళ్లారు. అయితే బస్సులో కూర్చొన్న గాయత్రిని అజయ్ అంకిత అనే హిజ్రా డబ్బు ఇవ్వమని అడిగారు. అందుకు గాయత్రి నిరాకరించారు. దీంతో ఆమె చేతిలో ఉన్న పర్సును హిజ్రా దౌర్జన్యంగా లాక్కున్నారు. ఈ పెనుగులాటలో గాయత్రి చేతికి గాయాలయ్యాయి. గాయత్రి పర్సులో ఉన్న రూ. 500లను బలవంతంగా లాక్కెళ్లడమే కాకుండా భయబ్రాంతులకు గురయ్యేలా తనను తిట్టిందని బాధితురాలు కళ్యాణదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సదరు హిజ్రాను పోలీసులుఅరెస్టు చేశారు. చట్ట వ్యతిరేకంగా బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story