- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ హైకోర్టు సీనియర్ న్యాయవాదికి టికెట్ దక్కుతుందా..?

దిశ, కళ్యాణదుర్గం: సీనియర్ హైకోర్టు న్యాయవాది శేషాద్రి నాయుడు బీజీపీ టికెట్ ఆశిస్తున్నారు. సెట్టూరు మండలం కనుకురుకి చెందిన ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ నేతలకు తెలిపినట్లు తెలుస్తోంది.
కాగా శేషాద్రి నాయుడు మంచి వ్యక్తి. సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేస్తున్నారు. ములకలేడు నుంచి కనుకూరు వరకు సెంట్రల్ గవ్నమెంట్‌తో మాట్లాడి దాదాపు 3.5 కిలోమీటర్ల రోడ్డు వేయించారు. హిందుత్వంపై ఉన్న అభిమానంతో 2018లో కనుకురు గ్రామంలో శ్రీ కుని రామలింగేశ్వర దేవాలయాన్ని తన సొంత నిధులతో నిర్మించారు. నిత్యం ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుంటూ తన వద్దకు వచ్చే ప్రజలకు ఏదో విధంగా న్యాయం చేస్తున్నారు. నిరు పేదల కేసులను ఉచితంగా హైకోర్టు కోర్టులో వాదిస్తున్నారు. ఇలాంటి మంచి వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు.