సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వొదు.. పుట్టపర్తి వైసీపీలో తారాస్థాయికి అసమ్మతి

by srinivas |   ( Updated:2024-03-18 11:17:13.0  )
సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వొదు.. పుట్టపర్తి వైసీపీలో తారాస్థాయికి అసమ్మతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టి‌కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే కేటాయించారు. దీంతో ఆ నియోజకవర్గంలో అసమ్మతి చెలరేగింది. శ్రీధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంత నేతలే వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించమని చెబుతున్నారు. గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసే యోచనలో ఉన్న సీఎం జగన్.... పుట్టపర్తి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డినే ప్రకటించారు. దీంతో నియోజవకర్గానికి చెందిన కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ శ్రీధర్‌రెడ్డికే టికెట్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి సహకరించేదని తీర్మానం చేశారు. రెండేళ్లగా పార్టీని కాపాడుకుంటూ వచ్చామని, అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కనీసం తమను సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed