- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యువత అన్ని రంగాల్లో రాణించాలి: మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి

X
దిశ, అనంతపురం: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మడకశిర శివాపురం నందు అంతర్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ యువత చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉందన్నారు. యువకులు బాధ్యతగా వ్యవహరించి క్రీడల్లోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. దేశ విదేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం ఉంటుందని తిప్పేస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య సాయిజిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి బాబు తదితరులు పాల్గొన్నారు.
Next Story