- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గిరిజన గ్రామాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు: జిల్లా కలెక్టర్

దిశ, పాడేరు: పర్యాటకులకు గిరిజన గ్రామాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తే గిరిజనుల అభివృద్ధికి దోహద పడతాయని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు. హోమ్ స్టేల వలన ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే లబ్దిదారులు పాత గృహాలను తొలగించకుండా కొత్త గృహాలను నిర్మించుకోవాలన్నారు. పాత ఇళ్లను హోమ్ స్టేలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నారు. హోమ్ స్టేలలో పర్యాటకులకు గిరిజన వంటల రుచులను చూపించాలన్నారు. గురువారం తహశీల్దార్, ఎంపిడిఓలు, పర్యాటక శాఖ, అటవీ శాఖ అధికారులతో పర్యాటక అభివృద్ధిలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో పర్యాటకులు హోమ్ స్టే ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో 15 హోమ్ స్టేలు ఏర్పాటు చేయడానికి అవసరమైన గిరిజన గృహాలను గుర్తించాలన్నారు. హోమ్ స్టేలకు సెర్ప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. సామాజిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. చింతపల్లి మండలంలో తాజంగి, లంబసింగి గ్రామాలలో ఎన్ని గృహాలను గుర్తించారని ఎంపిడిఓ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శిల్పారామం ఏర్పాటు చేయడానికి పాడేరు, హుకుంపేట మండలాల్లో 25 ఎకరాల భూమిని గుర్తించాలని చెప్పారు.
షెడ్యూల్ ఏరియా లోని పర్యాటక ప్రాంతాలు కలుషితం కాకుండా ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయించే షాపులను తనిఖీ చేసి సీజ్ చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం పై చెక్ పోస్టులు ఏర్పాటు పై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలన్నారు. అరకు వ్యాలీ, రంపచోడవరం, పాడేరు, అడ్డతీగల, రాజవొమ్మంగి మండల కేంద్రాలలో ప్రధాన రహదారులను ఆక్రమించి రవాణాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అటువంటి వాటి పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంచాయతీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు దురాక్రమణల పై తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాలను గుర్తించి పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన ప్రక్రియ పై ఆరా తీశారు. రూర్బన్ కింద జిల్లా పరిషత్ నుంచి నిధులు మంజూరు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, రంపచోడవరం పి ఓ కె. సింహచలం ,రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, డి ఎఫ్ ఓ పి.వి. సందీప్ రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి వి.మురళి, సిపిఓ ఎస్. ఎస్. ఆర్. కె. పట్నాయక్, డిటి ఓ దాసు, అరకు వ్యాలీ మ్యూజియం క్యూరేటర్ మురళి, 22 మండలాల ఎంపిడిఓలు, తహశీల్దార్, ఇ ఓ పి ఆర్ డిలు, ఎపి ఎఫ్ డిసి, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.