Kambadur: పులి సంచారంపై దిశ కథనానికి స్పందన

by srinivas |
Kambadur: పులి సంచారంపై దిశ కథనానికి స్పందన
X

దిశ, కళ్యాణదుర్గం: కంబదూరు మండలం దుర్గంకొండ సమీపంలో కలకలం రేపిన చిరుత సంచారంపై దిశ తెలుగు దినపత్రికలో ప్రచురితం అయ్యింది. ఈ కథనానికి స్పందించిన అటవీశాఖ అధికారులు సెక్షన్ ఆఫీసర్ సానవజ్, మండల అటవీ బీట్ అధికారి రామేశ్వరమ్మ ఆధ్వర్యంలో మంద, కుర్లపల్లి సమీపంలోని గ్రామ శివారు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మల్లేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఆలయంలో పని చేసే సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కంబదూరులో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ రామ్ సింగ్ ఆదేశాల మేరకు తాము పర్యటించినట్లు తెలిపారు. చిరుత సంచారం పునరావృతం అయితే అటవీ శాఖ తరుపున చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిరుతలు కంటపడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో పొలాల్లోకి వెళ్ళే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story

Most Viewed