- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyanadurg: చంద్రబాబు పర్యటనకు ముందే వివాదం
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 6న అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో ఆ పార్టీ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు సమాయత్తమయ్యారు. అధినేత పర్యటన ఏర్పాట్ల దృష్ట్యా కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
చంద్రబాబు రూట్ మ్యాప్‌పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, బీటీ నాయుడు ఆధ్వర్యంలో చర్చించారు. అయితే కళ్యాణదుర్గం ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఫ్లెక్సీ వివాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాలకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సర్ది చెప్పారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని సూచించారు.
Next Story