- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
Ap News: మతతత్వ పార్టీని ఓడించే శక్తి కాంగ్రెస్‌దే!

దిశ, మడకశిర: దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ చిత్తుగా ఓడిస్తుందని ఆయన తెలిపారు. మడకశిర కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొ్నారు. ఈ సందర్భంగా జంగ గౌతమ్ మాట్లాడుతూ ఏపీకి ప్యాకేజీ రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలపై చార్జిషీట్ విడుదల చేస్తున్నామని జంగా గౌతమ్ పేర్కొన్నారు.
దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్ర 50 ఏళ్లగా ఎవరు చేయలేదని జంగా గౌతమ్ చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీకి నిజమైన ప్రత్యామ్నాయంగా పోటీ చేసేది, ఓడించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. 'చేయి చేయి కలుపుదాం.. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని గెలిపిద్దాం' అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని జంగా గౌతమ్ గుర్తు చేశారు.