అనంతపురానికి సీఎం జగన్... షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-02-17 17:35:31.0  )
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, వెబ్ డెస్: సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో ఆదివారం పర్యటించనున్నారు. అక్కడ వైసీపీ నిర్వహించనున్న ‘సిద్ధం’ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అటు సీఎం సభ ప్రాంగణంలోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ సీఎం ‘సిద్ధం’ సభకు సంబంధించిన బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి భద్రతపై దిశా నిర్దేశం చేశారు. హెలీప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం జగన్ పర్యటన ప్రశాంతంగా ముగిసే వరకూ పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి ఆదివారం ఉదయం హెలీకాప్టర్‌లో బయల్దేరి వెళ్లనున్నారు. అనంతపురానికి చేరుకుని వైసీపీ సిద్ధం సభ వద్దకు చేరుకుంటారు. అనంతరం ప్రసంగించనున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో సీఎం జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అనంతపురంలో సీఎం జగన్ పర్యటించనున్నారు.

Next Story