- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'Cm Jaganకు ఏసుప్రభు మంచి బుద్ధి ప్రసాదించాలి'

X
దిశ, కళ్యాణదుర్గం: అనంతరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ క్రిస్మస్ పండగ వస్తే క్రైస్తవ సోదరులందరికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్రిస్మస్ కానుక వచ్చేదని, ఇప్పుడు పండుగ కూడా చేసుకోలేని పరిస్థితికి క్రైస్తవ సోదరులను తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికైనా మంచి బుద్ధి కలిగించి రాష్ట్రానికి మంచి పనులు చేసే విధంగా చూడాలని ఏసుప్రభుని ఉమామహేశ్వర్ నాయుడు కోరుకున్నారు. రాబోయే క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
Next Story