- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేవలం రూ.2లకే చికెన్ బిర్యానీ.. గుడ్డు బోనస్..!

దిశ, రాయలసీమ : హిందుపురంలో ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర మే నెలాఖరులో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. వంద రోజుల పాటు పేదలకు రెండు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టింది. అయితే ఈ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక భోజనాన్ని పేదలకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బిర్యానీ, చికెన్, గుడ్డు, ఒక స్వీటు పెట్టేలా ఏర్పాట్లు చేశారు.
ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు రూ .2 లకే భోజనం అందించారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఉంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీను ఏర్పాటు చేశారు. తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ అమ్మ క్యాంటీన్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వసుంధర అన్నారు. ఎన్టీఆర్ కోడలు అయినందుకు తాను గర్వ పడుతున్నానని తెలిపారు. ఇలాంటిది ఎక్కడ చూసి ఉండరు. నందమూరి పురంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుంది. మా మామ ఎన్టీఆర్ .. పైనుంచి ఇవన్నీ నడిపిస్తున్నారు అని వసుంధర చెప్పారు. హిందూపురాన్ని వసుంధర నందమూరి పురం అని చెప్పడం గమనార్హం.