Satyasai Dist: ఐదు మేకలను చంపి తిన్న చిరుత పులి.. భయంతో వణికిపోతున్న జనాలు

by srinivas |
Satyasai Dist: ఐదు మేకలను చంపి తిన్న చిరుత పులి.. భయంతో వణికిపోతున్న జనాలు
X

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లాలో ప్రజలను చిరుత పులి హడలెత్తిస్తోంది. రోళ్ల మండలం ఎల్కేపల్లిలో కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఇళ్ల పరిసరాలు, పొలాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా వక్కతోటలో ఉన్న మేకలమందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 5 మేకలు మృతి చెందాయి. దీంతో గ్రామస్థులు పులి అని పేరు వినబడితేనే జంకిపోతున్నారు. పులి ఎప్పుడు ఏం చేస్తోందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది.. చిరుత పులిని పట్టుకునేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నారు. చిరుతను బంధించే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని తెలిపారు. గుంపులు గుంపులుగా వెళ్లాలని స్పష్టం చేశారు. రాత్రి సమయంలో అసలు బయటకు రావొద్దని పేర్కొన్నారు.

Next Story

Most Viewed