- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజకీయ దుమారం రేపుతున్న బీఫార్మసీ విద్యార్థిని కేసు.. ప్రత్యేక కమిటీ నియమించిన బీజేపీ

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొదట తేజశ్వినిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. దీంతో తన కూతురుది ఆత్మహత్య కాదని రేప్ చేసి చంపేశారని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో బీఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే తండ్రి ఆరోపణల అనంతరం నిందితుడిపై రేప్ కేసు నమోదు చేశారు. ప్రస్తతం ఈ కేసు దిశా పీఎస్‌కు బదిలీ చేశారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు బాధ్యతను దిశా డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్లిం యువకుడిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి నిజనిర్ధారణ కమిటీ కూడా వేసింది. బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గోరంట్ల మండలం మల్లాపురంలో ఇప్పటికే పర్యటించింది.