- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్నికల వేళ వైసీపీకి గట్టి షాక్

దిశ, అనంతపురం ప్రతినిధి: ఎన్నికల వేళ రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. అనంతపురం రూరల్, కనగానపల్లి మండలాలకు చెందిన పలువురు కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం తమ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వారందరికీ సునీత కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి పంచాయతీ మల్లయ్య కాలనీకి చెందిన 25 కుటుంబాల వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అలాగే కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ నాయకుల వ్యవహార తీరుతో విసిగిపోయి తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. టీడీపీతోనే రాప్తాడు అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ వైసీపీకి కళ్ల ముందే ఓటమి కనిపిస్తోందన్నారు. అందుకే చాలా మంది నాయకులు పార్టీ మారుతున్నారన్నారు. ముఖ్యంగా రాప్తాడులో ఎమ్మెల్యే సోదరుల అరాచకాలతో ఇబ్బందులు పడ్డ సొంతపార్టీ నాయకులంతా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని జోస్యం చెప్పారు.