Ap News: ఆధారాలు లేకుండానే చంద్రబాబు అరెస్ట్.. !

by srinivas |
Ap News: ఆధారాలు లేకుండానే చంద్రబాబు అరెస్ట్.. !
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 46 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే అరెస్ట్‌కు సంబంధించిన ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. 2024లో చంద్రబాబు చస్తారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాజకీయాల్లో వ్యతిగత కక్షలు ఉండకూడదని సూచించారు. చంద్రబాబుపై గోరంట్ల వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు.


సాగు, తాగు నీరు విషయంలో ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో సాగు, తాగు నీరు విషయంలో ప్రభుత్వానికి సరైన విధానం లేదని శైలజానాథ్ విమర్శించారు. అందుకే అనంతరం జిల్లాలో చెరువులు ఎండిపోతున్నాయన్నారు. ఈ చెరువులకు హెచ్ఎల్సీ కాలువ సిస్టమ్ ద్వారా నీళ్లు తీసుకెళ్లాలని తెలిపారు. పీఏబీఆర్ డ్యాంలో 2.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని చెప్పారు. కనీసం 5.5 టీఎంసీ నీరు నీరు ఉంచుకోవాలని సూచించారు. డ్యాలు, క్రస్ట్ గేట్ల పట్ల వైసీపీ నేతలకు సరైన అవగాహన, శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు. నీటా వాటా పెంచకపోతే అనంతపురం జిల్లా మరింత కరువులో మునిగిపోతుందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే అనంతపురం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అప్పటికే స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని శైలజానాథ్ హెచ్చరించారు.

Next Story