తెలంగాణలో విన్నింగ్‌పై ఏపీ కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |
తెలంగాణలో విన్నింగ్‌పై ఏపీ కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ విన్నింగ్‌పై ఈ పార్టీ ఏపీ నేత రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విడుదల చేసిన డిక్లరేషన్‌ ప్రజాకర్షకంగా ఉందని తెలిపారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా మడకశిరలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక మాదిరిగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కార్డును ప్రతి ఇంటికి తీసుకెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తే ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్ని పర్యటనలు చేసినా.. సీఎం కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తారని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరమని తెలిపారు. పోలవరం ఆలస్యం కావడానికి బీజేపీ, వైసీపీ, టీడీపీలే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తి అయి ఉండేదని రఘువీరారెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed