- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రత్యేక హోదా మోదీ కాళ్ల వద్ద తాకట్టు..!

- వైసీపీ, టీడీపీ వల్ల రాష్ట్రం అధోగతి
- జగన్‌కు సీఎంగా ఉండే అర్హత లేదు
- - ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్
దిశ, ధర్మవరం: 24 పార్లమెంటు స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి, కేసులకు భయపడి ప్రధాని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ విమర్శించారు. ధర్మవరం కాంగ్రెస్ కార్యకర్తలను కలిసిన ఆయన ఏపీని సీఎం జగన్ అప్పుల ఆంధ్రగా మార్చాడని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంనంటి పేదవాడి నడ్డి విరుస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ స్థలాలను తాకట్టుపెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నింటినీ అమ్మేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని జంగా గౌతమ్ విమర్శించారు.
ఎనిమిదేళ్ల కాలంలో టీడీపీ, వైసీపీ రాజధాన్ని సైతం నిర్మించలేకపోయాయని జంగా గౌతమ్ విమర్శించారు. రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దురదృష్టం ఈ రాష్ట్రానికి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని, తన పదవికి రాజీనామా చేయాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ గూటికి రావాలని పిలుపు నిచ్చారు. అప్పుడే బిజెపిని గద్దె దింపి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా ఒక కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ తెలిపారు.