Tirumala News:తిరుమలలో అన్నదానం అద్భుతం:ఆర్థిక మంత్రి

by Jakkula Mamatha |
Tirumala News:తిరుమలలో అన్నదానం అద్భుతం:ఆర్థిక మంత్రి
X

దిశ ప్రతినిధి, అనంతపురం:తిరుమలలో అన్నదానం అద్భుతమని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తిరుమలలోని శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. సామాన్య భక్తులతో కలిసి క్యూలైన్ లో వెళ్లి అన్నం ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఆధ్వర్యంలో నాణ్యత కలిగిన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed