- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyadurgam: మధ్నాహ్న భోజనంపై కలెక్టర్ ఎం.గౌతమి కీలక వ్యాఖ్యలు

X
దిశ, కళ్యాణదుర్గం: మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. వజ్రకరూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6, 9 తరగతి విద్యార్థులకు జరుగుతున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వీస్ పరీక్షలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నాగరాజు, తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంఈవోలు తిమ్మప్ప, ఎర్రిస్వామి, హెడ్మాస్టర్ కృష్ణనాయక్, తదితరులు పాల్గొన్నారు.
Next Story