- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap News: భారీగా ఈవీఎంల రిజెక్ట్.. బెల్ కంపెనీకి రిటర్న్

దిశ, కళ్యాణదుర్గం: ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమంలో రిజెక్ట్ అయిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్‌లను తిరిగి బెల్ కంపెనీకి పంపిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. అనంతపురం పాత ఆర్డీవో కార్యాలయం కాంపౌండ్‌లోని ఈవీఎం గోడౌన్లను ఆమె తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ అక్టోబర్ 16 నుంచి ఈ నెల 9 వరకు ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం జరిగిందని చెప్పారు. ఈ తనిఖీల్లో 89 బ్యాలెట్ యూనిట్స్, 82 కంట్రోల్ యూనిట్స్, 218 వివి ప్యాట్స్‌లు రిజెక్ట్ యూనిట్స్ ఉన్నాయని తెలిపారు. రిజెక్ట్ అయిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యా లను స్కాన్ చేసి బెల్ కంపెనీకి పోలీస్ బందోబస్తుతో తిరిగి పంపిస్తామన్నారు. గోడౌన్‌లో పటిష్ట బందోబస్తుతో ఈవీఎంలను భద్రపరచాలని పోలీసులు, అధికారులను కలెక్టర్ గౌతమి ఆదేశించారు.