- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Guntakallu: రైలు ఇంజన్ రిపేరు చేస్తుండగా ఉద్యోగి మృతి
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: గుంతకల్లు రైల్వే లోకో షెడ్‌లో ప్రమాదం జరిగింది. డీజిల్ ఇంజన్లకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు శాంతారామ్ అనే గ్రేడ్ వన్ మెకానిక్ దుర్మరణం చెందాడు. రైలు ఇంజన్‌లో ప్రెషర్ ఫ్యాన్ రబ్బర్లను శాంతారామ్ మారుస్తున్నారు. అయితే గమనించకుండా మరో ఉద్యోగి రైలు ఇంజన్ ఆన్ చేశారు. దీంతో ఫ్యాన్ రెక్కల మధ్య చిక్కుకొని శాంతారాం దేహం ముక్కలయింది. అయితే ఇంజన్ ఆన్ చేసే సమయంలో లోకో పైలెట్ కచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇంజన్ ఆన్ చేయాలి. కానీ అలా జరగలేదు. ప్రమాదంలో శాంతారామ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు శాంతారాం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. తప్పు తెలితే చర్యలు తీసుకునే అవకాలున్నాయని తెలుస్తోంది.
Next Story