- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kadiri: 5 నెలల చిన్నారిని బస్ స్టాండ్‌లో వదిలి వెళ్లిన మహిళ

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా కదిరి(Sathya Sai district Kadiri)లో దారుణం జరిగింది. ఐదు నెలల చిన్నారని APSRTC బస్ స్టాండ్‌లో ఓ మహిళ వదిలేసి వెళ్లిపోయారు. బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని, బస్‌స్టాండ్ ప్రాంగణములో ఉన్న బీటెక్ విద్యార్థినికి పాపను అప్పగించి వెళ్లిపోయారు. ఎంతకీ సదరు మహిళ తిరిగిరాలేదు. దీంతో పోలీసులకు విద్యార్థిని సమాచారం అందజేశారు. పోలీసులు చిన్నారని స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అయితే మహిళ బస్టాండ్ ప్రాంగణంలో తిరిగిన విజువల్స్ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
కదిరి టౌన్ పోలీసులు చుట్టూ ప్రాంతాల్లో మహిళను గురించి విచారించగా ఆచూకీ తెలియలేదు. సదరు మహిళపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఎవరికైనా మహిళ సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. 9440796851కు ఫోన్ చేయాలని సూచించారు.