- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏటీఎం సెంటర్ వద్ద యువకుడి బురిడీ.. కేసు నమోదు

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ యువకుడు మోసానికి పాల్పడ్డారు. రిటైర్డ్ ఉద్యోగి ఏటీఎం కార్డు మార్చి రూ. 31 వేలు నొక్కేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా డబ్బులు అవసరం నిమిత్తం కల్యాణదుర్గం విద్యానగర్ కు చెందిన విశ్రాంతి ఉద్యోగి వీరభద్రం అదే ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు. డెబిట్ కార్డు నుంచి రూ.9 వేలు తీసుకున్నారు. అయితే ఏటీఎంలోకి వచ్చిన యువకుడు.. వీరభద్రం ఏటీఎం కార్డును మార్చి ఇచ్చాడు. కొంతసేపటికే రూ. 31 వేలు డ్రా చేసినట్లు వీరభద్రం ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో యువకుడు మోసం చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
Next Story