Satyasai Dist: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

by srinivas |
Satyasai Dist: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి
X

దిశ, కళ్యాణదుర్గం: సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువులో ఆర్టీసీ బస్సులో మహిళ మృతి చెందారు. అమడగూరు మండలం మామిడి మేకలపల్లికి చెందిన ఒలిపి చౌడమ్మ, భర్త ఈశ్వరప్పతో కలసి వైద్యం చేయించుకునేందుకు ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళుతుండగా ఓబుల దేవర చెరువు వద్ద ఆమె మృతి చెందారు. దీంతో తోటి ప్రయాణికులు మృతదేహాన్ని అక్కడే దించేశారు. మృతదేహాన్ని తన ఒడిలో ఉంచుకొని భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. మృతి దేహాన్ని మధ్యలోనే దింపేయడంతో మానవత్వం మంట కలిసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story