- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fire Accident: కదిరిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ గోదాం దగ్ధం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా కదిరిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయ్యప్పనగర్‌లోని ఫర్నీచర్ గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే గోదాంలో ఉన్న ఫర్నీచర్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది అంచనా వేసింది. గోదాంకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story