Kalyandurg: కంబదూరు ఆలయంలో ఎలుగుబంటి సంచారం

by srinivas |   ( Updated:2023-09-03 15:47:51.0  )
Kalyandurg: కంబదూరు ఆలయంలో ఎలుగుబంటి సంచారం
X

దిశ, కళ్యాణదుర్గం: కంబదూరు కమలమల్లేశ్వర స్వామి ఆలయంలో ఎలుగుబంటి సంచరించింది. రాత్రి సమయంలో ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పొలాలకు వెళ్ళే రైతులు, ఆలయానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు. అయితే క్వారీ నిర్వహించే యాజమాన్యాలు పేలుళ్లు జరపడం వలన కొండ ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణులు, జంతువులు జనసంచారంలోకి వస్తున్నాయనీ పలువురు ప్రజలు వాపోతున్నారు.

Next Story

Most Viewed