- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చేపా..చేపా..ఎందుకు షాప్ తీయలేదు.. Nara lokesh Selfie Raging

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని సెల్ఫీ ర్యాగింగ్ చేశారు. ఫిష్ ఆంధ్ర మినీ చేపల మార్కెట్‌ను ఈసారి టార్గెట్ చేశారు. ఓడి చెరువు నుంచి యువగళ పాదయాత్రలో ఫిష్ ఆంధ్ర మినీ చేపల మార్కెట్ దుకాణం మూసివేయడాన్ని చూశారు. దాంతో ఆ షాప్‌ను చూపిస్తూ సెల్పీ దిగారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘చేపా, చేపా ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డిమేటు అడ్డొచ్చింది అందట. అట్టా ఉంది మన జగన్ రెడ్డి చేపల బజార్ల తీరు. చేపల దుకాణం ఎందుకు తీయలేదంటే, సవాలక్ష కారణాలు. బులుగు రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఫిష్ ఆంధ్ర దుకాణాల నిర్వహణలో ఉంటే బాగుండేది. ఓబులదేవచెరువులో క్లోజ్ అయిన ఫిష్ ఆంధ్ర ముందు ఈ సెల్ఫీ దిగాను. గతంలో చిత్తూరు జిల్లాలో ఫిష్ ఆంధ్ర మూతపై ఓ సెల్ఫీతో ప్రశ్నించాను. మౌనం అర్దాంగీకారం అనుకోవచ్చా?. ఫిష్ ఆంధ్ర శాశ్వతంగా ఫినిష్ అయినట్టేనా?’ అని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.