Anakapalli: సురేశ్‌ను పట్టిస్తే రూ. 50 వేలు

by srinivas |
Anakapalli: సురేశ్‌ను పట్టిస్తే రూ. 50 వేలు
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు సురేశ్‌ను పట్టిస్తే రూ. 50 వేలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. బాలికను నరికి చంపిన కేసులో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏడు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండులో బాలికను సురేశ్ హత్య చేశారు. ప్రేమ పేరుతో బాలకను నిందితుడు గతంలోనే వేధించారు. ఈ కేసులో జైలుకెళ్లి బెయిల్ పై విడుదలైన సురేశ్.. స్కూలు వెళ్తున్న బాలికను వేటకొడవలితో నరికి చంపారు. కశింకోటకు చెందిన సురేశ్ కొప్పుగుండులోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు సురేశ్ పై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి ఇటీవల విడుదలైన నిందితుడు బాలికను బలి తీసుకున్నారు. అనంతరం పారిపోయారు. ఇంకా దొరకలేదు. దీంతో నిందితుడు సురేశ్‌ను పట్టిస్తే రూ. 50 వేలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

Next Story